తెలంగాణ గడ్డపై వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ
By Medi Samrat Published on 12 Nov 2022 4:19 PM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే. బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి గవర్నర్ తమిళిసై,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తనసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.
బీజేపీ బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా..అవినీతికి పాల్పడేవారిని వదిలి పెట్టననిన్నారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ ఆదరిస్తున్నారని దీనికి కారణమైన కష్టపడే బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చానని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు పోరాట పటిమ కలవారని వారినుంచి నేను స్ఫూర్తి పొందుతున్నానన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను తట్టుకుని బీజేపీ కార్యకర్తలు అడుగులు ముందుకు వేస్తున్నారని.. అటువంటి కార్యకర్తలు బీజేపీకి మాత్రమే ఉంటారన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విచారణల నుంచి బయటపడేందుకు కొంతమంది కూటములుగా ఏర్పడుతున్నారు.సామాన్యులకు సేవ చేయడానికి ఉన్నమార్గమే రాజకీయం. రాజకీయాలనేవి సేవాభావంతో ఉండాలి. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్లు మోదీని తిట్టడం, బీజేపీని తూలనాడటమే పనిగా పెట్టుకున్నారు. మోదీని తిట్టేవాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దు. వాళ్లకు నన్ను తిట్టడం తప్ప మరే పనిలేదు. 22ఏళ్లుగా నన్ను చాలా మంది తిడుతూనే ఉన్నారని.. టీ తాగుతూ ఆ తిట్లను ఎంజాయ్ చేయాలని అన్నారు.
Next Story