శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఘ‌న స్వాగ‌తం

PM Narendra Modi arrives in Hyderabad.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2022 2:59 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఘ‌న స్వాగ‌తం

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికిన వారిలో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మోదీ ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్‌లో ఇక్రిశాట్‌కు బ‌య‌ల్దేరారు. ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వంలో మోదీ పాల్గొని కొత్త లోగోను ఆవిష్క‌రించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేయ‌నున్నారు. రాత్రి 8:25 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

కాగా.. సీఎం కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటన ఆద్యంతం వెంటే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే.. కేసీరా్ స్వ‌ల్ప జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ కార‌ణంగానే ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నారు. జ్వ‌రం త‌గ్గితే ముచ్చింత‌ల్ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Next Story