సీఎం కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ

PM Modi wishes CM KCR.తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2021 10:31 AM IST
PM Modi wishes CM KCR

తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అంతేకాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సీఎంకు శుభాకాంక్ష‌లు తెలిపారు.



సీఎం కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకంక్ష‌లు. కేసీఆర్ ఆయురారోగ్యాతో ప్ర‌జా సువ‌లో ముందుకు సాగాలి - తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర‌రాజ‌న్‌

మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు - మంత్రి హరీశ్‌ రావు



ప‌చ్చద‌నాన్ని ప్రేమించే కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. కోటి వృక్షార్చ‌న‌లో భాగంగా మొక్క‌లు నాట‌డ‌మే మ‌న‌మిచ్చే కానుక‌. అంద‌రం మొక్కలు నాటుదాం. ప‌రిర‌క్షించే బాధ్య‌త తీసుకుందాం - సీనిన‌టుడు చిరంజీవి



Next Story