సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని మోదీ, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

PM Modi Telangana Governor Tamilisai greet CM KCR on birthday.కేసీఆర్ నేడు 69వ ప‌డిలోకి అడుగుపెడుతున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2023 10:48 AM IST
సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని మోదీ, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) అధ్య‌క్షుడు కేసీఆర్ నేడు 69వ ప‌డిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు, సినీ, క్రీడా సహా ఇతర రంగాలకు చెందిన ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌రో వైపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ లు కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

'తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

'తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు' - గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై



Next Story