బోయిగూడ అగ్నిప్ర‌మాదం.. ప్ర‌ధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

PM announces RS 2 lakh compensation for family of 11 killed in Hyderabad fire.సికింద్రాబాద్‌లోని బోయిగూడ‌లో జ‌రిగిన భారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 7:01 AM GMT
బోయిగూడ అగ్నిప్ర‌మాదం.. ప్ర‌ధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్‌లోని బోయిగూడ‌లో జ‌రిగిన భారీ అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అగ్నిప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలియ‌జేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.2లక్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు.

అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న త‌న‌ను క‌లిచివేసిందని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తెలియ‌జేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను రాజ్ భ‌వ‌న్ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తమిళిసై ఆకాంక్షించారు.

బోయిగూడ తుక్కు పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

అగ్నిప్ర‌మాదంలో 11 మంది వ‌ల‌స కార్మికులు స‌జీవ ద‌హ‌నం బాదాక‌ర‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. వారి మృతి తీవ్రంగా క‌ల‌చివేసింద‌న్నారు. ఉపాధి కోసం బిహార్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన కూలీలు మృతి చెంద‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

పొట్ట‌కూటి కోసం బిహార్ నుంచి వ‌ల‌స వ‌చ్చి ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. మృతుల కుటుంబాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. అనుమ‌తుల నుంచి సేఫ్టీ చ‌ర్య‌ల దాకా అధికారుల్లో నెల‌కొన్న నిర్ల‌క్ష్యం, ప‌ర్య‌వేక్ష‌ణాలోప‌మే ఇలాంటి ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Next Story
Share it