తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో పిటిషన్

Petition in High Court Against New Year Celebrations In Telangana. నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ‌ ప్రభుత్వం ఇచ్చిన‌ ఉత్తర్వులపై హైకోర్టులో

By Medi Samrat  Published on  29 Dec 2021 9:47 AM GMT
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో పిటిషన్

నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ‌ ప్రభుత్వం ఇచ్చిన‌ ఉత్తర్వులపై హైకోర్టులో బుధ‌వారం పిటీష‌న్ దాఖ‌లైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఇతర రాప్ట్రాల మాదిరి ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ప్యాండమిక్, ఎపిడెమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని కోర్టు దృష్టికి తెసుకెళ్లాడు పిటిషనర్. ఇష్టానుసారంగా ప్రభుత్వం ఓమిక్రాన్ ను కట్టడి చేయకుండా.. న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమిక్రన్ కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టేలా ఆదేశించాల‌ని పిటిషనర్ కోర్టును కోరాడు. పిటిషన్‌ను రేపు విచారిస్తామని పేర్కొంది హైకోర్టు.


Next Story