ఎమ్మెల్యే సీతక్క.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. ఉప్పెన లాంటి వాగ్ధాటి గల మహిళా నాయకురాలు. సమస్య ఏదైనా ఆమె గళం విప్పితే అధికార పక్షం గుండెల్లో గుబులు మొదలవుతుంది. వరదలు సమయంలో, లాక్‌డౌన్ నడుస్తున్నప్పుడు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్న సీతక్క.. తాజాగా పోడు భూములపై అసెంబ్లీలో గళమెత్తారు.
అలాగే ములుగు ఏజెన్సీ పరధిలోని మత్స్య కార్మికులపై ఫారెస్ట్ అధికారుల దాడుల గురించి అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. దీంతో తమ సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సీతక్కకు మత్స్య కారులు పాలాభిషేకం చేశారు. మూములుగా అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులకు పాలాభిషేకాలు చూస్తుటాం.. కానీ ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇలా చేయడం హాట్ టాఫిక్ గా మారింది.