వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన మున్సిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. తన కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుండి రూ.20,000 లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
2023లో ఫిర్యాదుదారు చేసిన పెయింటింగ్, CC రోడ్ల కాంట్రాక్ట్ పని కోసం ఆదిశేషు లంచం డిమాండ్ చేసాడు. రసాయన పరీక్షలో రెండు చేతుల వేళ్లు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. అతని ఆఫీస్ టేబుల్ కీ బోర్డ్ షెల్వ్ నుండి లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆదిశేషు అనుచిత లబ్ధి పొందేందుకు అన్యాయంగా విధులు నిర్వర్తించాడని, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు తెలిపారు.