బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుంది : టీపీసీసీ చీఫ్
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 25 Jan 2025 9:15 PM ISTకేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనం.. రాష్ట్రం ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో లక్షా 78 వేల 950 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు
పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందన్నారు. తెలంగాణ ప్రజల పదేళ్ల నిరీక్షణ ఇందిరమ్మ ఇళ్లతో తీరబోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి.. ఆర్థిక పరిస్థితి బాగో లేకున్నా సీఎం రేవంత్, మంత్రుల హయంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభం అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలకు కనువిప్పు కలిగిలా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుందని.. బీఆర్ఎస్ పార్టీలో తండ్రి, కొడుకు తప్ప ఎవరు మిగలరు అన్నారు.