బీజేపీలో ఆయనకే కుర్చీ లేదు.. మహేశ్వర్ రెడ్డికి పీసీసీ చీఫ్ కౌంటర్
ఏ నిష్పత్తిలో జనాభా ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ జరగాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు
By Medi Samrat Published on 2 Nov 2024 4:00 PM ISTఏ నిష్పత్తిలో జనాభా ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ జరగాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కుల గణన జరగాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన మీద అన్ని జిల్లాలలో సమావేశం ఇవ్వాళ జరుగుతుందని తెలిపారు. మేధావులు, విద్యార్థి నాయకులు, కుల సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం, నేను భావించాం.. ఈ నెల 5న సాయంత్రం నాలుగు గంటలకు బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో పీసీసీ ఆధ్వర్యంలో కుల గణన మీద జరిగే సలహాల సేకరణలో రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొంటారని వెల్లడించారు.
కుల సర్వేపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. పీసీసీ కోరుకునేది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సర్వే లో భాగం కావాలి. కుల గణన తో పాటు అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు కనెక్టింగ్ సెంటర్ ఉపయోగ పడుతుంది. ప్రజలకు మేలు చేయాలనే మా లక్ష్యం అన్నారు.
మహేశ్వర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతుందన్నారు. మహేశ్వర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. మహేశ్వర్ రెడ్డి కి బీజేపీ లో దక్కుతున్న గౌరవం వల్ల బాధ అవుతుందన్నారు. బీజేపీ లో ఆయనకే కుర్చీ లేదన్నారు.. కాంగ్రెస్ లో ఉన్న ప్రజాస్వామ్యం.. స్వేచ్ఛ వేరే పార్టీలో ఉండదన్నారు.
ప్రధాని మోదీ ఇస్తానన్న సంక్షేమ పథకాలు.. ఉద్యోగాలు ఏవి..? అని ప్రశ్నించారు. సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అన్నారు. పీసీసీ తరుపున అన్ని పార్టీలను పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి సలహాలు తీసుకుంటాం.. కుల గణన నిష్పక్షపాతంగా.. సజావుగా జరగాలన్నారు. కుల గణన సర్వే ఎక్కడ బ్రేక్ లేకుండా జరగాలి అనేదే ప్రభుత్వం ఆలోచన.. కేసిఆర్ కి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు..? అని ప్రశ్నించారు.