అసోం సీఎం భార్యపై వ్యాఖ్యల కేసు..తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన పవన్ ఖేరా

తెలంగాణ హైకోర్టును కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆశ్రయించారు

By -  Knakam Karthik
Published on : 9 April 2026 8:41 AM IST

Telangana, PawanKhera, Congress, TelanganaHigh Court, AssamPolice, HimantaBiswaSarma, AnticipatoryBail

అసోం సీఎం భార్యపై వ్యాఖ్యల కేసు..తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన పవన్ ఖేరా

తెలంగాణ హైకోర్టును కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆశ్రయించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ భార్య రణికి భుయాన్ శర్మపై పవన్ ఖేరా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు ఒకటి కంటే ఎక్కువ విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయంటూ ఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఖేరా చేసిన వ్యాఖ్యలపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫోర్జరీ, తప్పుడు సమాచారం ఇవ్వడం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద గౌహతి క్రైమ్ బ్రాంచ్‌లో ఈ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది.

Next Story