ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌

Pawan Kalyan Tour in Nalgonda District Today.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు(శుక్ర‌వారం) ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2022 10:55 AM IST
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు(శుక్ర‌వారం) ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించ‌నున్నారు. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిచ‌నున్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లాలోని చౌటుప్పల్, కోదాడలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సాగ‌నుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి బ‌య‌లుదేరి మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం చేరుకుంటారు. అక్క‌డ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్క‌డి నుంచి కోదాడ చేరుకుని కడియం శ్రీనివాస్‌ కుటుంట సభ్యులను క‌లుసుకుంటారు. అనంత‌రం జ‌న‌సేనాని కోదాడ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నారు. పవన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Next Story