వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan interesting comments on Netaji.వంద రూపాయ‌ల నోటుపై స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు నేతాజీ సుభాష్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2022 7:36 AM GMT
వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

వంద రూపాయ‌ల నోటుపై స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ బొమ్మ వేయాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఆయ‌న్ను గౌర‌వించుకోక‌పోతే మ‌నం భార‌తీయుల‌మే కాద‌న్నారు. పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ పాల్గొని ప్ర‌సంగించారు. పవన్‌తో పాటు డాక్టర్‌ పద్మజారెడ్డి, ఎం.వి.ఆర్‌.శాస్త్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎం.వి.ఆర్‌.శాస్త్రి రచించిన 'నేతాజీ' గ్రంథ స‌మీక్ష‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంవీఆర్ శాస్త్రిని మూడు సార్లు మాత్ర‌మే క‌లిసిన‌ట్లు చెప్పారు. ఆయన దాదాపు 20 పుస్తకాలు రచించారు. నేను సినిమా ఉచితంగా చూస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని చెప్పారు. అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలే ఎక్కువ విలువైనవ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇక త‌న వ‌ద్ద‌కు త్రివిక్రమ్‌ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తాను అని ప‌వ‌న్ తెలిపారు.

నేతాజీ సుభాష్‌చంద్రబోస్ గురించి మాట్లాడుతూ.. జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్య‌క్తి వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్ అని.. వంద రూపాయల నోటుపై ఆయన బొమ్మ వేయాల‌న్నారు. ఆయన్ను గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని ప‌వ‌న్ చెప్పారు. ఈ దేశం నాదనుకునే నాయకుడు ఒక్కడూ లేడు. ఎంతో మంది బలిదానాల వల్లే ఈరోజు దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. నేతాజీ అస్థిక‌లు రెంకోజి ఆల‌యంలో దిక్కులేకుండా ఉన్నాయి. ఆ య‌న అస్థిక‌లు తిరిగి తీసుకురావాలి. ఆ ఆస్థిక‌లు నేతాజీవి అవునా కాదా.. అని ప‌రీక్ష‌లు చేసి తేల్చ‌లేమా..? ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ప్రయత్నించినా కుదరలేదు. నేతాజీ ఆస్థిక‌లు దేశానికి తీసుకురావాల‌ని ప్ర‌జ‌లు కోరుకోవాల‌ని అని ప‌వ‌న్ అన్నారు. ఈ సందర్భంగా #RenkojitoRedfort, #BringbackNetajiAshes అనే హ్యాష్ ట్యాగ్‌లను షేర్‌ చేశారు.

Next Story
Share it