ఆడపిల్లకు ఎంత కష్టమొచ్చింది..!

ఎన్నో రంగాల్లో ఆడపిల్లలు.. ఎంతో ఎత్తుకు ఎదుగుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  21 Oct 2023 10:29 AM GMT
ఆడపిల్లకు ఎంత కష్టమొచ్చింది..!

ఎన్నో రంగాల్లో ఆడపిల్లలు.. ఎంతో ఎత్తుకు ఎదుగుతూ ఉన్నారు. అయినా కూడా కొందరు ఆడపిల్ల పుడితే తమ ఇంట్లో ఏమో జరిగిపోయిందని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మగ పిల్లాడు పుట్టడం కోసమే పూజలు చేసే కుటుంబాలు ఉన్నాయి. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పదిరోజుల క్రితం ఓ మహిళ ఆడపిల్లకి జన్మని ఇచ్చింది. గతంలో మూడు కాన్పులు జరగగా.. అందులో ముగ్గురూ ఆడపిల్లలే.!


ఇక నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ దంపతులు బాధపడ్డారు. కన్న బిడ్డ అనే మమకారం చూపించలేదు. ఆ పసిపాపను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. గత పది రోజుల నుండి ఆసుపత్రి సిబ్బంది పాపను సంరక్షిస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రుల మనసు మారుతుందేమోనని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. పాప ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాలల సంరక్షణ భవన్ కు పాపను అప్పగించనున్నారు.

Next Story