నమ్మిన కేసీఆర్‌కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను: పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat
Published on : 7 April 2025 7:45 PM IST

నమ్మిన కేసీఆర్‌కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను: పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఓ గుంట నక్క, తనను బొచ్చు కుక్క అని విమర్శిస్తోందని అన్నారు. అవును నేను కుక్కనే నన్ను నమ్మిన కేసీఆర్‌కు విశ్వాసమైన కుక్కలా ఉంటానని అన్నారు. కానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దుంకే నీలాంటి గుంటనక్కను మాత్రం కాను అంటూ సెటైర్‌ వేశారు.

"అవును, నేను కుక్కనే. నన్ను నమ్మిన కేసీఆర్ కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను. కానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దూకే కడియం శ్రీహరి లాంటి గుంట నక్కను మాత్రం కాదు" అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పనిచేస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.

Next Story