ప్రజా పాలనలో ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్ళానని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం లాగా మేము మోసం చేయడం లేదు.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
నా నియోజకవర్గంలో కూడా పల్లె బాట కార్యక్రమం మొదలు పెట్టానని తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకునేలా ఇప్పటికే 20 గ్రామాలు తిరిగానని.. రాజకీయ ఎత్తులు, జిత్తులు అట్లాంటివి పట్టించుకోనన్నారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. పాలకుర్తి కోడల్నీ, ఆడపడుచుగా ప్రజలకు ఎళ్లవేళలా సేవ చేయడమే నా టార్గెట్ అన్నారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామ ని తెలిపారు.