పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ వైర‌ల్ అవుతున్న ఆడియో.. నిజమేనా..?

Padi Koushik Reddy Viral Audio. తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ వేదికగా పాలిటిక్స్ కాస్తా వేడెక్కుతూ ఉన్నాయి. ఈ సీటును ఎలాగైనా

By Medi Samrat  Published on  12 July 2021 4:26 AM GMT
పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ వైర‌ల్ అవుతున్న ఆడియో.. నిజమేనా..?

తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ వేదికగా రాజ‌కీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ భావిస్తూ ఉండగా..! ఈటలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. హుజురాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా టీఆర్ఎస్ సీటు కూడా ఆయనకే దక్కుతుందనే ప్రచారం మొదలైంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చిన నాటి నుంచి ఆయన పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి తనను టికెట్ రాదనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం. గతంలో ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను కలిశారు కౌశిక్ రెడ్డి. ఈ సమయంలోనే అతడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి.


2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కౌశిక్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాదనే అభిప్రాయంతో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా ప్రచారం మొదలైంది.

ఇంతలో ఓ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతూ ఉంది. టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ తనకే దక్కిందని ఓ యువకుడితో మాట్లాడిన ఆడియో అంటూ కొందరు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది కౌశిక్ రెడ్డి వాయిసా..? కాదా..? అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ.. టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ తనకే దక్కిందని సదరు కార్యకర్తతో చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందులా కాదని.. పరిస్థితి, పద్ధతులు మారాయంటూ అతడు చెప్పడం చూడొచ్చు. యూత్ ను సమాయత్తం చేయాలని అందులో మాట్లాడడం గమనించవచ్చు. యూత్ కి ఎన్ని డబ్బులు కావాలో నేను చేసుకుంటా.. వారి ఖర్చులకు 3000, 4000, 5000 ఇస్తానంటూ అందులో ఉండడాన్ని వినొచ్చు. ఇదిమాదన్న పేట యువకునితో జరిపిన సంభాషణలా అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని యువకుడితో కౌశిక్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఆ మాటలు వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు ఇంతకూ నిజమా.. కాదా అనే విషయం తెలియాల్సి ఉంది.



Next Story