ఆ కార్య‌క్ర‌మానికి సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ని పిలుస్తాం : మధుయాష్కీ గౌడ్

PAC meeting in the first week of every month. ఇక నుండి ప్రతి నెల మొదటి వారంలో పీఏసీ మీటింగ్ ఉంటుందని టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌ మధుయాష్కీ గౌడ్ తెలిపారు

By Medi Samrat  Published on  26 May 2023 6:14 PM IST
ఆ కార్య‌క్ర‌మానికి సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ని పిలుస్తాం : మధుయాష్కీ గౌడ్

ఇక నుండి ప్రతి నెల మొదటి వారంలో పీఏసీ మీటింగ్ ఉంటుందని టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన పీఏసీ స‌మావేశం అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణను దోచుకొని, దాచుకున్న కేసీఆర్ కుటుంబం.. ప్రజలని విస్మరించిందన్నారు. ఆంధ్రా వాళ్ళు దోచుకున్నారని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రా వాళ్ళకి దోచిపెడుతున్నాడని ఆరోపించారు.

జూన్ 2 నుండి 20 రోజుల కార్యక్రమాలు చేపడతామ‌న్న ఆయ‌న‌.. ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఏవిధంగా విస్మరించారో ప్రజలకు వివరిస్తామ‌ని తెలిపారు. జూన్ 2న సోనియా గాంధీకి పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఇరవై రోజుల పాటు కాంగ్రెస్ శ్రేణుల ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సూచించారు. బీసీ గర్జన కార్యక్రమం చేస్తాం. దానికి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ని పిలుస్తామ‌ని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని చూపిస్తూ.. దళితులను మోసం చేసే విధానాన్ని ప్రజలకి వివరిస్తామ‌ని పేర్కొన్నారు.



Next Story