పాతబస్తీలో కాదు.. చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రకటనపై ఆల్ ఇండియా
By అంజి Published on 31 May 2023 9:00 AM ISTపాతబస్తీలో కాదు.. చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి
తెలంగాణ: హైదరాబాద్‌లోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రకటనపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం నాడు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బదులుగా చైనాపై సర్జికల్ స్ట్రైక్ మౌంట్ చేయాలన్నారు. 2020లో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. రోహింగ్యా, పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తానీ ఓటర్ల సహాయంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలని పాలక భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం చీఫ్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
‘‘పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, రోహింగ్యాలకు చెందిన ఓటర్లు లేకుండానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం’’ అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కుమార్ అన్నారు. తాజాగా మంగళవారం (నిన్న) సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధినేత ఆ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెబుతున్నారు. మీకు దమ్ము ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి అంటూ సవాల్ విసారు.
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా ఒవైసీ విరుచుకుపడ్డారు. ''స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకు (అమిత్ షా) ఎందుకు నొప్పి వస్తుంది?'' అని అన్నారు. దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ తన చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అన్నారు. స్టీరింగ్ తన చేతిలో ఉంటే, మీకు నొప్పి ఎందుకు వస్తుంది? అంటూ ప్రశ్నించారు. అంతకుముందు ఏప్రిల్ 23న కర్ణాటకలోని చేవెళ్లలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'సంకల్ప్ సభ' లో అమిత్ షా ప్రసంగిస్తూ.. అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.