2014 నుంచి తెలంగాణ‌లో ఎన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయో తెలుసా..?

Only 12 govt degree colleges established in TS since 2014. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్తగా 12 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయని

By Medi Samrat  Published on  20 July 2022 3:00 PM GMT
2014 నుంచి తెలంగాణ‌లో ఎన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయో తెలుసా..?

తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్తగా 12 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయని ఆర్టీఐ ఇచ్చిన సమాధానంలో వెల్లడించింది. రంగారెడ్డిలోని మీర్‌పేటకు చెందిన రాజేష్ అల్లాటి అనే వ్యక్తి ఆర్టీఐ దాఖలు చేశారు. 2014 నుంచి తెలంగాణలో కొత్తగా 12 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయని కాలేజీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తన సమాధానంలో పేర్కొంది. 12లో 4 హైదరాబాద్‌లో, 2 రంగారెడ్డిలో, 1 మేడ్చల్ మల్కాజిగిరిలో, 2 వికారాబాద్‌లో, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లో 2, నల్గొండలో 1 ఏర్పాటు చేశామన్నారు.

విభజన తర్వాత తెలంగాణలో 117 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మిగిలిపోయాయని పేర్కొంది. ఈ 117 కళాశాలలు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్ (7 కళాశాలలు), రంగారెడ్డి (8), మహబూబ్ నగర్ (19), నల్గొండ (10), ఖమ్మం (11), వరంగల్ (13), కరీంనగర్ (16), ఆదిలాబాద్ (9), నిజామాబాద్ (10), మెదక్ (14) ఉన్న‌ట్లు వివ‌రించింది.

దీన్నిబట్టి 2014 తర్వాత జిల్లాల్లో కొత్త కాలేజీల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకుసాగ‌లేదు. మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లలో మాత్రమే కొత్త ప్రభుత్వ కళాశాలలు వచ్చాయి.

రాజేష్ కోరిన మరో ముఖ్యమైన సమాచారం తెలంగాణలోని 129 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు. మహబూబాబాద్‌లోని జీడీసీ మరిపెడ, వరంగల్‌లోని జీడీసీ వర్ధన్నపేటలో రెండు కళాశాలలు అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. చాలా ప్రభుత్వ కళాశాలలు సొంత‌ భవనాలలో కొన‌సాగుతున్నాయి, అయితే వాటిలో కొన్ని ఇప్పటికీ వివిధ జూనియర్ కళాశాలల భవనాలలో నడుస్తున్నాయి.

మౌలిక సదుపాయాల కల్పన గురించి వివిధ వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను చూసిన తర్వాత.. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల పరిస్థితి, వాటిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసుకోవాలనుకున్నానని రాజేష్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం 2014, 2018 ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిందని, కానీ ఆ హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని రాజేష్ ఆరోపించారు.

2014, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి జిల్లాకు కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, ప్రతి మండలానికి ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల వంటి వాగ్దానాలను ప్రభుత్వం విస్మరించింది. కానీ ఇప్పటికీ అద్దె భవనాల్లోనే తరగతులు నడుస్తున్నాయి. వర్ధన్నపేట, మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాల్లోనే చాలా డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి.. ఉన్న కాలేజీలకు సరైన మౌలిక వసతులు, సిబ్బంది లేకపోయినా ప్రభుత్వ హామీలకు హద్దులు లేవు'' అని రాజేశ్ అన్నారు.






















Next Story