Video : ఉల్లిపాయల లారీ బోల్తా పడిందని తెలియగానే..

లారీ బోల్తా పడిందని తెలియగానే ఎవరైనా వెళ్లి సాయం చేస్తారు.

By -  Medi Samrat
Published on : 10 Nov 2025 7:56 PM IST

Video : ఉల్లిపాయల లారీ బోల్తా పడిందని తెలియగానే..

లారీ బోల్తా పడిందని తెలియగానే ఎవరైనా వెళ్లి సాయం చేస్తారు. కానీ లారీలో నుండి పడిపోయిన వస్తువుల కోసం ఎగబడుతూ ఉంటారు మానవత్వమన్నది చూపెట్టకుండా!! నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా పడటంతో స్థానికులు, వాహనదారులు బస్తాలను తీసుకువెళ్లారు.

జిల్లాలోని నార్కట్‌పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఈ ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును ఉల్లిపాయల లోడుతో వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ధాటికి లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. సమీప ప్రాంతాల నుంచి వాహనదారులు, స్థానికులు లారీలోని ఉల్లిపాయల బస్తాలను తీసుకువెళ్లడానికి ఎగబడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉల్లిపాయల బస్తాలు తీసుకువెళుతున్న వారిని నిలువరించారు.

Next Story