గత పదేళ్లుగా నీళ్లు తాగని వృద్ధురాలు.. కానీ?

old woman who has not drunk water for the last ten years. ప్రాణం ఉన్న ఏ జీవి అయినా భూమిపై సంచరించాలి అంటే కచ్చితంగా నీటి

By Medi Samrat  Published on  22 Dec 2020 11:51 AM GMT
గత పదేళ్లుగా నీళ్లు తాగని వృద్ధురాలు.. కానీ?

ప్రాణం ఉన్న ఏ జీవి అయినా భూమిపై సంచరించాలి అంటే కచ్చితంగా నీటి అవసరం ఎంతో ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతిరోజు మన శరీరానికి తగినంత నీరు తాగుతుండాలి. అలా తాగినప్పుడు మాత్రమే తిన్న ఆహారం జీర్ణం అయ్యి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. దాహం వేసినప్పుడు కొద్దిసేపు నీరు ఆలస్యమైతే దాహంతో ఎంతో విలవిలలాడిపోతూ ఉంటాము. అలాంటిది ఓ వృద్ధురాలు ఏకంగా పదేళ్ల నుంచి నీటిని ముట్ట‌లేదంట‌. పూర్తి వివరాల్లోకి వెళితే...

జనగామ జిల్లాకు చెందిన ప్రమీలమ్మ అనే వృద్ధురాలు గత పది సంవత్సరముల నుంచి నీటిని తాగకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఎంత బ్రతిమిలాడిన కూడా ఆమె నీటిని తాగకుండా జీవిస్తుంది. అందరిలాగే పదేళ్ళ వయసు వరకు నీటిని తీసుకున్న ప్రమీలమ్మ వయసు పెరిగేకొద్దీ నీటిని తాగడం తగ్గించింది. గత పది సంవత్సరాల నుంచి నీటిని ముట్టుకోకుండా కాలం గడుపుతోంది. అయితే ఆరోగ్య విషయంలో ఈమెకు(70) ఎలాంటి సమస్యలు లేకుండా.. ఈ వయసులో కూడా ఇంటి పనులను ఎంతో చక్కగా నిర్వహిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

సాధారణంగా చలి, వర్షాకాలంలో చాలా వరకు నీటిని తాగడం తగ్గిస్తూ ఉంటారు. అదే వేసవి కాలంలో అయితే తీసుకున్న ఆహారం కన్నా నీటిని ఎక్కువగా తాగుతారు. అలాంటి భగభగ మండే ఎండలో సైతం ప్రమీలమ్మ నీరు తాగకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.సాధారణంగా కొన్ని గంటల పాటు నీటిని తాగకుండా ఉంటే అనారోగ్యానికి గురవుతారు అలాంటిది కొన్ని సంవత్సరాల నుంచి నీటిని తాగకుండా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం నీటి శాతం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడమేనని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ విధంగా నీటిని తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి ప్రమాదం అని డాక్టర్లు సూచిస్తున్నారు.


Next Story