తెలంగాణ వ్యాప్తంగా మండలానిక ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లిస్ట్‌ను రెడీ చేశారు. ఈ మేరకు ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ మీటింగ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. లబ్ధిదారులు సర్కార్ రూల్స్ ప్రకారం.. ఇంటిని ఎలా నిర్మించుకోవాలి. నిర్మాణ సామాగ్రి సరఫరా, ఇతర అనుమానాలను ఈ సమావేశంలో నివృత్తి చేస్తారు. లబ్ధిదారుడు.. ఇందిరమ్మ యాప్ సర్వే టైమ్‌లో చూపిన స్థలంలోనే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. వేరే చోట కట్టుకుంటానంటే అధికారులు ఆ ఇంటిని రద్దు చేస్తారు. ముగ్గు పోసుకున్న తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రామ కార్యదర్శి ఆ స్థలం ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. అలాగే జియో ట్యాగింగ్ చేస్తారు.
400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలి. ముగ్గు పోసుకునేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదు. పునాది లేసిన తర్వాత మాత్రమే రూ.1 లక్ష లబ్ధిదారుడి ఖాతాలో వేస్తుంది. ప్రతి ఇంటికి 8 టాక్టర్ల ఇసుకను అందించనున్నారు. ఇందుకు సంబంధించిన కూపన్లను ఎమ్మార్వో లేదా ఆర్డీవో ఇవ్వనున్నారు. సిమెంట్, స్టీల్ సామాగ్రి కూడా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువకు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడికి నగదును జమ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే అక్కడక్కడ ప్రీ గ్రౌండింగ్ పూర్తైంది. ప్రభుత్వం మొదటి విడతలో 71482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. .ఇందులో 21 నియోజకవర్గాల్లో వెయ్యికిపైగా ఇవ్వనుంది.