మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి విచారణ చేయనున్నారు. కరోనా కారణంగా ఇన్నాళ్లు విచారణ పెండింగ్‌లో పడిన ఈ కేసులో అచ్చంపేట, హాకీంపేటలో కూడా సర్వే కొనసాగనుంది. జమునా హ్యాచరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేయగా కరోనా కారణంగా విచారణ ముందుకు సాగలేదు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం చేయనున్నారు. జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్‌పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటెల కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది. టీఆర్ఎస్ మంత్రిగా ఉన్న ఈటల బర్తరఫ్‌కు గురయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం చేయనున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట్ లో ఈటల కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై మరోసారి నోటీసులు ఇచ్చింది డిప్యూటీ ఇన్సెపెక్టర్ ఆఫ్ సర్వే. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు తిరిగి విచారణ చేస్తామని చెప్పారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్.