బల్మూరి వెంకట్ అరెస్ట్
NSUI Leader Balmoori Venkat Arrest. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) నాయకుడు
By Medi Samrat Published on 18 Jun 2022 6:29 PM ISTనేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) నాయకుడు బల్మూరి వెంకట్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసానికి తన అనుచరులతో వెళ్తుండగా వెంకట్‌ను పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిసేందుకు జూబ్లీహిల్స్‌కు బల్మూరి వెంకట్ వచ్చారు. జగ్గారెడ్డిని కలవడానికి మాత్రమే వచ్చానని, ఎలాంటి కార్యక్రమం చేయడానికి రాలేదని పోలీసులకు వెంకట్ చెప్పుకొచ్చారు. వెంకట్‌ను అరెస్ట్ చేయకుండా ఆపడానికి జగ్గారెడ్డి ప్రయత్నించారు. బల్మూరి వెంకట్‌ను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. పోలీసుల తీరుపై జగ్గారెడ్డి, వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంకట్ తన అనుచరులతో కలిసి శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో అతన్ని ముందస్తుగా అదుపులోకి తీసుకొని గోల్కొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వెంకట్‌ను విడుదల చేయాలని పోలీసులను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరినట్లు తెలుస్తోంది. వెంకట్ కోసం జగ్గారెడ్డి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.