ప్రజాసంగ్రామ యాత్రను నిలిపేయండి.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

Notices to stop Bandi Sanjay Praja Sangrama Yatra. బీజేపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండని

By Medi Samrat
Published on : 23 Aug 2022 4:39 PM IST

ప్రజాసంగ్రామ యాత్రను నిలిపేయండి.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

బీజేపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండని మంగ‌ళ‌వారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు వర్దన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జ‌నగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసులో తెలిపారు పోలీసులు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే.. శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు.


Next Story