జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆమెతో పాటు పర్యావరణ, భూగర్భ గనుల శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లో కొండరాళ్లను తొలగించేందుకు జరుగుతున్న పేలుళ్లపై వచ్చిన కథనాలపై స్పందించిన హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రాత్రిపూట పెద్ద శబ్ధాలు వస్తుండడంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలపగా.. న్యాయస్థానం ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. విచారణలో భాగంగా పర్యావరణ, భూగర్భ గనులు, పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీలతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చింది.
జూబ్లీహిల్స్‌లో కొండ రాళ్లను పేల్చడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను ప్రతి వాదులుగా చేర్చి త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమ్రపాలి వివరణ ఇవ్వాల్సి ఉంది.