కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్య‌లు.. వాతావరణ నిపుణులు ఏమంటున్నారంటే..

Not Foreign Hand not Cloudburst but Heavy Rains Behind Godavari Floods say Experts. జూలై 2022 నెలలో భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగడానికి కారణం క్లౌడ్ బరస్ట్

By Medi Samrat  Published on  18 July 2022 4:00 PM GMT
కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్య‌లు.. వాతావరణ నిపుణులు ఏమంటున్నారంటే..

జూలై 2022 నెలలో భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగడానికి కారణం క్లౌడ్ బరస్ట్ కానే కాదని అంటున్నారు వాతావరణ నిపుణులు. మధ్య భారతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది.

తెలంగాణలో 52 గ్రామాలు నీట మునిగాయి, 8,984 మంది గ్రామస్థులు ఖాళీ చేయబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో 191 గ్రామాలు వర్షపు నీటితో మునిగిపోగా, 76,775 మంది గ్రామస్థులు ఖాళీ చేశారు. స్కైమెట్ వెదర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ముఖ్య వాతావరణ శాస్త్రవేత్త మహేష్ పలావత్ మాట్లాడుతూ.. "ఈ ప్రాంతంలో చాలా భారీ వర్షాలు కురిశాయి. నదీ పరీవాహక ప్రాంతాలలో కూడా వరదలు సంభవించాయి. జూలై 2022లో గోదావరి ప్రాంతంలో మేఘాల విస్ఫోటనం జరగలేదు." అని తెలిపారు.

గోదావరి వరదలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని వెనుక కుట్రలు ఉన్నాయని, క్లౌడ్ బరస్ట్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇరత దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని, గతంలో లేహ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఇలాగే క్లౌడ్ బరస్ట్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని కేసీఆర్ అన్నారు. వరదలకు అసలు అది కారణమే కాదని నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖకు చెందిన రాడార్ సరిగ్గా పని చేయకపోవడంతో భారీ వర్షాలను అంచనా వేయడంలో వాతావరణ శాఖ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. అయితే భారీ వర్షాల కారణంగానే వరదలు సంభవించాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణ నిపుణులందరూ పేర్కొంటున్నారు. వరదలు, వాతావరణ పరిస్థితులను రాజకీయం చేయడంతో, ఇలాంటి వాదనలు, ప్రకటనల విషయంలో డేటా, సైన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని వాతావరణ నిపుణులు అంటున్నారు.

క్లౌడ్‌బర్స్ట్ అంటే ఏమిటి(What is a cloudburst)?

క్లౌడ్‌బర్స్ట్ అనేది 20 నుండి 30 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రదేశంలో గంటకు 100 మిమీ లేదా 10 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వడం. క్లౌడ్‌బర్స్ట్‌లు భారత ఉపఖండంలో సర్వసాధారణం. అంతకుముందు హిమాలయ ప్రాంతాలలో మాత్రమే చోటు చేసుకునేవి. 1969 నుండి 2015 వరకు భారతదేశంలోని 126 వాతావరణ కేంద్రాలు వర్షపాతాన్ని అధ్యయనం చేస్తున్నాయి. 28 క్లౌడ్‌బర్స్ట్‌ల ఘటనలు నమోదయ్యాయని తేలింది. ఈ సమయంలో పశ్చిమ కనుమలు, హిమాలయాల దిగువ ప్రాంతాలలో జూలై నెలలో 5 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

భారత ఉపఖండంలో క్లౌడ్‌బర్స్ట్ సర్వసాధారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఉష్ణమండల దేశాలకు కూడా వర్తిస్తుంది. భారీ వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉన్నందున క్లౌడ్‌బర్స్ట్ అంచనా వేయడం కష్టం. క్లౌడ్‌బర్స్ట్ సంభవించిన తర్వాత, దానిని నిర్ణయించే వాతావరణ శాస్త్ర లెక్కలు ఉన్నాయి. ప్రస్తుత జులై 2022లో TS, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో వర్షాలు కురుస్తాయని, వాతావరణ నిపుణులు అల్పపీడన జోన్ అని పేర్కొన్నారు.

క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి?

క్లౌడ్ సీడింగ్ అనేది వాతావరణ మార్పుకు సాంకేతికత, ఇది చిన్న కేంద్రకాలను సబ్‌ఫ్రీజింగ్ మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని కృత్రిమ వర్షాలు అని కూడా అంటారు.

క్లౌడ్ సీడింగ్ వల్ల మేఘ విస్ఫోటనం (క్లౌడ్‌బర్స్ట్) ఏర్పడుతుందా?

కాదు.. అని వాతావరణ నిపుణులు తెలిపారు.

Next Story
Share it