ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌ స్వీకారం చేసిన నోముల భగత్

Nomula Bhagat Takes Oath As MLA. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  12 Aug 2021 3:11 PM IST
ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌ స్వీకారం చేసిన నోముల భగత్

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే.. భ‌గ‌త్‌ చేత ఎమ్మెల్యేగా గురువారం నాడు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సంద‌ర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. భగత్ కు అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడెంటిటీ కార్డును అందించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు హాజరయ్యారు. ఉపఎన్నిక‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల భగత్ 18 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.


Next Story