TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్ ప‌రీక్ష‌.. అభ్యర్థులు ఈ గైడ్‌లైన్స్‌ పాటించాల్సిందే..!

జూన్ 9న జరిగే గ్రూప్ I ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జారీ చేసిన నిర్దిష్ట ప్రోటోకాల్‌లకు పాటించాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు

By Medi Samrat  Published on  30 May 2024 2:00 PM IST
TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్ ప‌రీక్ష‌.. అభ్యర్థులు ఈ గైడ్‌లైన్స్‌ పాటించాల్సిందే..!

జూన్ 9న జరిగే గ్రూప్ I ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జారీ చేసిన నిర్దిష్ట ప్రోటోకాల్‌లకు పాటించాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. TSPSC సెక్రటరీ డాక్టర్ E. నవీన్ నికోలస్ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించారు. డ్రెస్ కోడ్ పాటించడమే కాకుండా.. నిషేధిత వస్తువులను గురించి కూడా వివరణ ఇచ్చారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు బూట్లు ధరించకుండా చెప్పులు మాత్రమే ధరించాలని సూచించారు. బయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా అబ్స్ట్రక్టివ్ మెటీరియల్‌ని ఉంచుకోకూడదని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు, లాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, జోలాలు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించబోమని తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి TSPSC వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలి.

Next Story