దసరా సెలవుల్లో మార్పు లేదు..!

No change in Dasara holidays for Telangana schools. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు ద‌స‌రా సెలవులు ఉంటాయ‌ని

By Medi Samrat
Published on : 21 Sept 2022 3:57 PM IST

దసరా సెలవుల్లో మార్పు లేదు..!

సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు ద‌స‌రా సెలవులు ఉంటాయ‌ని డైరెక్ట‌ర్ ఆప్ స్కూల్ ఎడ్యూకేష‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 9 వరకు (సెప్టెంబర్ 25 ఆదివారంతో సహా) అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలోని అన్ని ప్రైమరీ/అప్పర్ ప్రైమరీ/హైస్కూళ్లకు ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రెస్ నోట్‌లో స్పష్టం చేశారు.


అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే ప్రకటించిన దసరా సెలవుల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని డైరెక్టర్ ప్రెస్ నోట్‌లో తెలిపారు. తెలంగాణలో దసరా సెలవులను తగ్గిస్తారంటూ రెండు రోజులుగా సాగుతున్న ప్రచారంపై విద్యాశాఖ స్పందించింది. ఈ మేరకు సెలవుల మార్పు లేదని అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.


Next Story