ఏసీబీకి చిక్కిన‌ మున్సిపల్‌ అధికారి.. భారీగా నగదు స్వాధీనం

ఏసీబీ చేతికి మ‌రో అవినీతి తిమింగ‌ళం చిక్కింది. ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడటంతో అధికారులు అవాక్క‌య్యారు

By Medi Samrat  Published on  9 Aug 2024 1:35 PM GMT
ఏసీబీకి చిక్కిన‌ మున్సిపల్‌ అధికారి.. భారీగా నగదు స్వాధీనం

ఏసీబీ చేతికి మ‌రో అవినీతి తిమింగ‌ళం చిక్కింది. ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడటంతో అధికారులు అవాక్క‌య్యారు. దాసరి నరేందర్ నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం రావటంతో ఏసీబీ అధికారులు అత‌ని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. 9వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం నుంచి సోదాలు చేప‌ట్టిన అధికారులు.. భారీగా అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించారు.

దాసరి నరేందర్ ఇళ్లు, అతని బంధువుల ఇళ్లల్లో ఏకంగా 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయల డబ్బు బయటపడింది. డబ్బును కట్టలు కట్టి.. గుట్టలుగా పెట్టాడు నరేందర్. ఈ నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. అలాగే నరేందర్ బ్యాంక్ ఖాతాలో కోటి 10 లక్షల రూపాయలు కూడా గుర్తించారు. ఇంట్లోని బీరువాలో అర కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు క‌నుగొన్నారు. ఇప్పటి వరకూ జరిగిన సోదాల్లో దాసరి నరేందర్ నుంచి సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ‌ రూ.6.07 కోట్లుగా అధికారులు వెల్ల‌డించారు.

Next Story