ఇది థర్డ్‌ వేవ్‌కు సంకేతం.. వచ్చే 4 వారాలు కీలకం: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌

Next 4 weeks very important for people due to corona.. Telangana Health Director‌. ఓమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు.

By అంజి  Published on  30 Dec 2021 2:08 PM IST
ఇది థర్డ్‌ వేవ్‌కు సంకేతం.. వచ్చే 4 వారాలు కీలకం: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌

ఓమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే 14 నుండి 28 రోజులు చాల కీలకమని అన్నారు. అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇది థర్డ్‌ వేవ్‌కు సంకేతమని చెన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ వస్తే.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు. కోఠిలోని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రజలకు న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నీతి ఆయోగ్‌ రిలీజ్‌ చేసిన హెల్త్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉండడంపై గర్వ కారణంగా ఉందని అన్నారు. వైద్యారోగ్య సిబ్బంది సేవలకు నిదర్శనమే ఈ ఫలితం అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని శ్రీనివాస్‌ తెలిపారు.

ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోతు అవుతుండగా.. తెలంగాణ రాష్ట్రంలోనూ పాజిటివ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని అన్నారు. పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని, వచ్చే నాలుగు వారాలు చాల కీలకమైనవని పేర్కొన్నారు. కేసులు పెరిగినా.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఓమిక్రాన్‌ నుంచి రక్షణ పొందొచ్చని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. న్యూఇయర్‌ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎప్పుడూ చూడనంతగా కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోందని.. అయితే సుమారు 90 శాతం మందిలో ఓమిక్రాన్‌ లక్షణాలు కనిపించడం లేదన్నారు.

Next Story