ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన దేశపతి, నవీన్‌ కుమార్‌, చల్లా

Newly elected BRS MLCs take oath. నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఎమ్మెల్సీలు

By Medi Samrat  Published on  31 March 2023 1:19 PM GMT
ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన దేశపతి, నవీన్‌ కుమార్‌, చల్లా

Newly elected BRS MLCs take oath


నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామి రెడ్డి, కే నవీన్ కుమార్ శుక్రవారం కౌన్సిల్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన‌ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ.. వీరు మార్చి 16న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో నూతన ఎమ్మెల్సలీలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నేత‌లు కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.


Next Story