స‌రికొత్త‌ స్పోర్ట్స్‌ యాప్‌ 'వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌' వచ్చేసింది..!

New sports app 'What's in the Game' has launched. పూర్తి సరికొత్త స్పోర్ట్స్‌ మీడియా, టెక్‌ స్టార్టప్‌ ‘వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌’ ను ఆ సంస్థ

By Medi Samrat  Published on  23 July 2022 4:30 PM IST
స‌రికొత్త‌ స్పోర్ట్స్‌ యాప్‌ వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌ వచ్చేసింది..!

పూర్తి సరికొత్త స్పోర్ట్స్‌ మీడియా, టెక్‌ స్టార్టప్‌ 'వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌' ను ఆ సంస్థ వ్యవస్థాపకులు అనిల్‌ కుమార్‌ మామిడాల, ఈజెబీ ప్రమీల, అంతర్జాతీయ బాడ్మింటన్‌ ఆటగాడు, భాగస్వామి బీ సాయి ప్రణీత్‌లు ప్రారంభించారు. వెబ్‌ 3.0, మెటావర్శ్‌ స్పోర్ట్స్‌ అప్లికేషన్‌ 'వాట్సా ఇన్‌ ద గేమ్‌'. ఇది 60 పదాలు లేదా అంతకంటే తక్కువ లోనే సంక్షిప్త సమాచారం అందించ‌నుంది, షెడ్యూల్స్‌, అంత‌ర్జాతీయంగా క్రీడలు, వాటి ఫలితాలను అందిస్తుంది. క్రీడలకు సంబంధించి సమస్త సమాచారమూ అందించే ఏకీకృత కేంద్రంగా దీనిని నిలపాలన్నది లక్ష్యం.

ఈ స్టార్టప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.

నిత్యం వేగవంతంగా మారుతున్న ప్రపంచంలో ప్రజలకు అసలు సమయం చిక్కడం లేదు. చాలా బిజీగా వారు గడుపుతున్నారు. తమకెంతో ఇష్టమైన క్రీడలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం వారికి ఓ భయానక అనుభవంగానే ఉంటుంది. ఎందుకంటే, పలు యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను అనుసరించాల్సి రావడంతో పాటుగా తమ ప్రాధాన్యతలకనుగుణంగా విభిన్నమైన క్రీడా యాప్‌లనూ అనుసరించాల్సి వస్తుంది. వీటితో పాటుగా 75 రకాలకు పైగా క్రీడలకు ఆదరణ కలిగిన దేశంలో పరిమిత మొత్తంలో మాత్రమే కంటెంట్‌ మనకు లభ్యమవుతుంది.

ఈ దిశగా మార్పు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా రోజుల తరబడి కృషి చేసిన తరువాత, మేము ఓ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాము. ఇది ప్రతి క్రీడాభిమానికి నూతన విధానము అందించడంతో పాటుగా ప్రతి క్రీడాభిమాని, అథ్లెట్‌కు ఓ పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ తొలి వెర్షన్‌ వాట్స్‌ఇన్‌దగేమ్‌లో ప్రస్తుతం సంక్షిప్త సమాచారం, షెడ్యూల్స్‌, ఫలితాలను అన్ని ఒలింపిక్‌, పారా ఒలింపిక్‌, నాన్‌ ఒలింపిక్‌ క్రీడలు, వింటర్‌ గేమ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అతి సరళమైన స్వైపింగ్‌ అవకాశంతో అందిస్తుంది. ఇది కేవలం సమయం మాత్రమే ఆదా చేయడం కాకుండా అదే సమయంలో అదే వేదికపై బహుళ క్రీడలతో అనుసంధానించబడి ఉండేందుకు సైతం తగిన అవకాశం అందిస్తుంది. ఇక్కడ చెప్పాల్సిన మరో అంశం, ఇది కేవలం ఆరంభం మాత్రమే. సంభావ్య ఫీచర్లు మరియు అప్‌గ్రేడ్స్‌పై మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. దీనిద్వారా అంతర్జాతీయంగా క్రీడా మీడియా, సాంకేతిక పరిశ్రమలో వైవిధ్యతను తీసుకురానున్నాము.

ఈ స్టార్టప్‌ వ్యవస్ధాపకులలో ఒకరైన అనిల్‌ కుమార్‌ మామిడాల మాట్లాడుతూ '' మేము ఎంతోకాలంగా కలలుగంటున్న స్వప్నం సాకారమైన రోజు ఇది. ఎంతో సంతోషంగా ఉంది. దీనిని భారీగా తీర్చిదిద్దడంతో పాటుగా మాకు లాగా క్రీడలను అభిమానించే వారికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తాము. ఇప్పటికే మేము మెటావర్శ్‌, వెబ్‌ 3.0 టెక్నాలజీలపై పనిచేస్తున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాను. వీటి ద్వారా ప్రతి క్రీడాభిమానికి పూర్తి సరికొత్త కోణాన్ని ఈ అప్లికేషన్‌ అందించనుంది'' అని అన్నారు.

అంతర్జాతీయ బాడ్మింటన్‌ క్రీడాకారుడు, ఈ స్టార్టప్‌ భాగస్వామి సాయి ప్రణీత్‌ బి మాట్లాడుతూ ''ఓ అథ్లెట్‌గా, క్రీడాభిమానిగా, ఈ ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విభిన్నమైన ఫీచర్లను జోడించేందుకు ప్రణాళిక చేశాము. ఇవి వయసు, లింగం, ఆట స్థాయి, ఎంచుకున్న క్రీడతో సంబంధం లేకుండా అథ్లెట్లకు సహాయపడుతూ, వారు మరో స్థాయికి చేరుకునేందుకు తోడ్పడుతుంది. మేము ఈ యాప్‌ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాము.. సమీప భవిష్యత్‌లో క్రీడా ప్రపంచంలో సంచలనాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాము'' అని అన్నారు.

ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఉపకరణాలపై డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.



























Next Story