శుభవార్త.. రాష్ట్రంలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik
Published on : 3 July 2025 8:06 AM IST

Telangana, Congress Government, New Ration Cards, Minister Uttam

శుభవార్త.. రాష్ట్రంలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 14వ తేదీన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని తెలిపారు.

బుధవారం నల్గొండలో జరిగిన రివ్యూ మీటింగ్‌‌‌‌కు జిల్లా ఇన్‌‌‌‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌తో కలిసి ఉత్తమ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లు పాలించిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కేవలం ఉప ఎన్నికల టైంలోనే కార్డులను మంజూరు చేసిందని ఫైర్ అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలనను ఈ నెల 13లోగా పూర్తి చేసి, అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2.89 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 99 శాతం మంది ప్రజలు ఈ బియ్యన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

Next Story