తెలంగాణలో మరో కొత్త పార్టీ.. అదే ప్రధాన డిమాండ్.!

New Political party in telangana. తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. మాజీ కేంద్రమంత్రి శివశంకర్‌ తనయుడు డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ రాష్ట్రంలో

By అంజి  Published on  27 Oct 2021 12:10 PM GMT
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. అదే ప్రధాన డిమాండ్.!

తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. మాజీ కేంద్రమంత్రి శివశంకర్‌ తనయుడు డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ రాష్ట్రంలో పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ తన మద్దతు దారులతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఎన్నో పోరాటలతో సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్న ఏకైక డిమాండ్‌తో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు వినయ్‌ కుమార్‌ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యినట్లు వెల్లడించారు. డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును, జెండా, అజెండాను ప్రకటిస్తామన్నారు. రాజకీయాల్లోకి తనను డాక్టర్ మిత్ర లాగారని వినయ్‌ కుమార్‌ గుర్తు చేసుకున్నారు.

2014 జులై 27న జరిగిన మాసాయిపేట రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో స్టాండర్స్‌ లేవని.. చదివించటం ప్రభుత్వ బాధ్యత కాదా అంటూ ప్రశ్నించారు. తాను చాలా గ్రామాల్లో పర్యటించానని.. ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు సరిగ్గా చెప్పలేకపోవడం వల్లే.. ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెప్పారని అన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. గుర్తును చూసి ఓటు వేసే వాళ్లను రాజకీయ నేతలు కోరుకుంటున్నారని అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి.. నోటాకు ఓటు వేశానని వినయ్ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it