Hyderabad: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు ఊరట

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla
Published on : 15 Sept 2023 5:45 PM IST

Navadeep, Drugs Case, Hyderabad, Telangana, High Court,

 Hyderabad: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు ఊరట

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌కు ఊరట లభించింది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల హైదరాబాద్‌లో బయటపడ్డ డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌ పేరు వినిపించింది. ఈ నేపథ్యలో నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు తెలిసిందనీ.. అందుకే అతను పరారీలో ఉన్నాడని వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన నవదీప్‌.. డ్రగ్స్‌ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. నవదీప్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను అరెస్ట్‌ చేయొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. నవదీప్‌కు డ్రగ్స్‌ కేసులో ఊరట లభించినట్లయ్యింది.

కాగా.. టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన, షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ కేసులో టాలీవుడ్ లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కూడా ఉన్నట్లు తెలిపారు. నవదీప్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్‌ చేశామని సీపీ సీవీ ఆనంద్ వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నటుడు నవదీప్‌ నేరుగా కోర్టును ఆశ్రయించారు.. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Next Story