విలువ పెరగడంతోనే ఆ భూములపై వారి కన్ను పడింది: సీపీఐ నారాయణ

వాల్యూ పెరగడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 4 April 2025 11:58 AM IST

Telangana, Congress Government, CPI Narayana, Cm Revanth, Supreme Court, HCU Land Issue

విలువ పెరగడంతోనే ఆ భూములపై వారి కన్ను పడింది: సీపీఐ నారాయణ

ల్యాండ్ వాల్యూ పెరగడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. విద్యా సంస్థ భూములు విద్యా వ్యవస్థ కోసమే ఉపయోగించాలి. ప్రభుత్వ భూమి అమ్మడం అనేది తప్పు. జనాభా అవసరాలు పెరిగినప్పుడు ప్రభుత్వం చేతిలో భూమి లేకుండా పోతే ఎలా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది? మీరు కూడా ఇప్పుడు అదే చేస్తే ఎలా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. అది రేవంత్ రెడ్డి భూమి కాదు.. ప్రభుత్వ భూమి అని నారాయణ విమర్శించారు.

హెచ్‌సీయూ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. విద్యా వ్యవస్థ జోలికి వెళ్లము అని ప్రకటించాలి. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. భూమి వ్యాపార వస్తువుగా చూడకూడదు. హెచ్‌సీయూ భూములు అమ్ముతుంటే, విద్యార్థులను కొడుతుంటే.. మిత్రపక్షం ఏంటి? రాజకీయాలు వేరు.. ప్రజా, విద్యా సమస్యలు వేరు. విద్యా వ్యవస్థ జోలికి ఎవరూ రాకూడదు...అని నారాయణ పేర్కొన్నారు.

Next Story