2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతుల్లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కోదాడ పోలీసుస్టేషన్‌లో జగన్ పై కేసు నమోదైంది.
ఇందుకు సంబంధించి పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. కేసులో ఏ2, ఏ3గా ఉన్న నిందితులపై అక్కడి న్యాయస్థానం కేసు కొట్టేయగా.. ఏ1గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. ఫిబ్రవరి 12న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇదిలావుంటే.. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ విషయంలో ఆరోపణలన్నీ అవాస్తవం అని.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల సారథ్యంలోని రెండు వేర్వేరు కమిటీలు నివేదిక ఇచ్చినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.