బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి కోర్టులో ఊరట

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రాహిల్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది..

By Medi Samrat  Published on  10 April 2024 9:32 PM IST
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి కోర్టులో ఊరట

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కు నాంపల్లి కోర్టు లో ఊరట లభించింది. రాహిల్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.. 20 వేల రూపాయల రెండు ష్యూరిటీలను సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని రాహిల్ ను నాంపల్లి కోర్టు ఆదేశించింది.

పంజాగుట్ట ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో ఇటీవలే రాహిల్ అరెస్టు అయ్యాడు. చంచల్ గూడ జైల్లో రాహిల్ ను ఉంచారు. మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదానికి కారణమై, ఆ కేసు నుంచి తప్పించుకోడానికి మరొకర్ని పోలీసులకు అప్పగించి దుబాయ్‌ కు వెళ్ళిపోయాడు రాహిల్. మూడు నెలలకు పైగా దుబాయ్‌ లో తల దాచుకుంటున్న రాహిల్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. నిందితుడిపై లుకౌట్ నోటీసులు అమల్లో ఉండటంతో విమానాశ్రయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ విమానాశ్రయం లో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story