కేంద్రం చేతులు ఎత్తేసింది : నామా నాగేశ్వరరావు

Nama Nageshwarao Fires On Center. కేంద్రం వైఖరి వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ లోక్‌స‌భా పక్ష నేత

By Medi Samrat  Published on  29 Nov 2021 12:52 PM GMT
కేంద్రం చేతులు ఎత్తేసింది : నామా నాగేశ్వరరావు

కేంద్రం వైఖరి వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ లోక్‌స‌భా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. రెండు నెలలుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంటే కేంద్రం చేతులు ఎత్తేసిందని అన్నారు. ఏడాదిగా దేశ రైతాంగం రోడ్లపై ఉంటే.. ఇప్పుడు తెలంగాణ రైతాంగం రోడ్డున పడేలా చేస్తున్నారని విమ‌ర్శించారు. పార్లమెంట్ లో పంట కొనుగోళ్లపై వాయిదా తీర్మానాలు ఇచ్చామ‌ని.. లోక్ సభ స్పీకర్ తిరస్కరించారని తెలిపారు. పంటల కొనుగోళ్లపై చర్చకు నిరాకరించడంతో ఆందోళన చేసామ‌ని వివ‌రించారు.

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఏకపక్షంగా చర్చ లేకుండా ఆమోదించారని.. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు పై చర్చ లేకుండా చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 3 రోజులు ఇక్కడే ఉండి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారని.. రైతులను, తెలంగాణను, తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అవమానపరుస్తుందని అన్నారు. ఇంత అధిక పంట ఎలా పండుతుంది అని కేంద్రం అడుగుతుందని.. ఏడేండ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని బలోపేతం చేసాం. పంట సాగు, ఉత్పత్తి పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నామ‌ని తెలిపామ‌న్నారు.

మళ్ళీ పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ రైతాంగ సమస్యలు లెవనెత్తుతామ‌ని.. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగానికి సంబందించిన అంశం కాబట్టి మిగతా పార్టీల ఎంపీలు కుడా మాతో కలవాలని కోరారు. తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలని.. లేదంటే రైతులు ఆగ్రహానికి గురవుతారని.. రానున్న కాలంలో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి ఉండదని నామా నాగేశ్వరరావు అన్నారు.


Next Story