ట్రీ ఐసోలేషన్‌.. ఆ యువకుడికి తట్టిన ఐడియా సూపర్

Nalgonda Man Set Tree Isolation. కరోనా మహమ్మారిని జయించడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా పోరాడుతూ

By Medi Samrat  Published on  15 May 2021 10:35 AM GMT
ట్రీ ఐసోలేషన్‌.. ఆ యువకుడికి తట్టిన ఐడియా సూపర్

కరోనా మహమ్మారిని జయించడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా పోరాడుతూ ఉన్నారు. కరోనా సోకగానే భయపడకుండా ఉండాలని పలువురు సూచిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటే విజయం సాధించవచ్చు. కరోనా సోకిన విషయం తెలుసుకోగానే చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఇతరులకు దూరంగా ఐసోలేషన్ లో ఉండాలి. అలా చేస్తేనే మన కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మంచి చేసిన వాళ్లమవుతాము. ఐసోలేషన్ అంటే ప్రత్యకంగా ఒక చోట ఉండడం.. కానీ అందరి ఇళ్లలోనూ ప్రత్యేకంగా గదులు వంటివి దొరకకపోవచ్చు. అలాంటి సమయంలోనే వేరే మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. అలా కొత్తగా ఆలోచించిన యువకుడు చెట్టులో ఐసోలేషన్ ప్రాంతంగా చేసుకున్నాడు.

న‌ల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన శివకు కరోనా సోకింది. ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. పేదవాళ్ళు కావడం.. అతడి ఇంట్లో ఉన్నది ఒక్కటే రూము కావడంతో.. ఐసోలేషన్ లో ఎలా ఉండాలి అనే ప్రశ్న అతడిని వెంటాడింది. ఇంటి ముందున్న చెట్టు గుర్తుకు రావడంతో దాన్ని ఐసోలేషన్ రూమ్ గా మార్చుకున్నాడు. చెట్టుపై మంచం కట్టి అక్కడే ఉంటున్నాడు. చెట్టు మీద తన కోసం విడిగా నివాసం ఏర్పరుచుకోవడాన్ని పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు. శివ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉంటుండగా.. శివ మాత్రం ఇంటి ముందు ఉన్న చెట్టుపైన మంచం కట్టి అక్కడే గత పది రోజుల నుంచి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు శివ కోసం నీళ్లు, భోజనం కింది నుంచి పంపిస్తే భోజనం చేసి అక్కడే పడుకుంటున్నాడు.


Next Story