టికెట్ ఎవరికివ్వాలో తర్జన.. భర్జన..!

Nagarjunasagar ByPoll BJP Candidate. తెలంగాణలో గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మద్య వార్ పెద్ద ఎత్తున నడుస్తుంది.

By Medi Samrat  Published on  27 Feb 2021 2:27 PM GMT
టికెట్ ఎవరికివ్వాలో తర్జన.. భర్జన..!

తెలంగాణలో గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మద్య వార్ పెద్ద ఎత్తున నడుస్తుంది. దుబ్బాక ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకున్న తర్వాత జీహెచ్ఎంసీలో గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలవడంతో బీజేపీలో నూతనోత్సాహం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా పాతేందుకు సన్నాహాలు మొదలు పెట్టాయి.

ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఏకి పారేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపీ కార్యాలయంలో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

అభ్యర్థి ఎంపిక, గెలుపు వ్యూహాలపై చర్చించి, దిశానిర్దేశం చేస్తున్నారు. 2018లో పోటీ చేసిన నివేదిత రెడ్డి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని విజ్ఞప్తి చేసింది. టిడిపి నుంచి బిజెపీ లో చేరిన అంజయ్య యాదవ్ తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇద్దరిలో ఒక్కరికి టికెట్ ఇవ్వడమా లేక కొత్త వ్యక్తికి కేటాయించాలా అనే అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.

ఇదిలావుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టి.ఆర్.ఎస్ అభ్యర్థులు తక్షణమే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘురామారెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలని ఆయన విమర్శించారు. హైదరాబాద్.. హైదర్ గూడలో‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.


Next Story