సాగర్ ఉప ఎన్నిక బరిలో 41 మంది

Nagarjuna Sagar By Election Candidates Final List. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది నిలిచారు. ఈరోజుతో ఉప ఎన్నిక

By Medi Samrat  Published on  3 April 2021 5:13 PM IST
సాగర్ ఉప ఎన్నిక బరిలో 41 మంది

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది నిలిచారు. ఈరోజుతో ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 77 నామినేషన్లు దాఖలు కాగా, పలు కారణాలతో 17 మంది నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. బీజేపీ సాగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నివేదితారెడ్డి, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి కుతుబుద్ధిన్‌లు తిరస్కరణ జాబితాలో ఉన్నారు.

మ‌రో 19 మంది అభ్యర్థులు నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. ఉపఎన్నిక నిర్వహణ తీరుపై జిల్లా ఎన్నికల అధికారి పీజేపాటిల్‌, ఎస్పీ ఏవీ రంగనాథ్‌లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సాగర్‌లో మకాం వేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు అణువణువు పరిశీలిస్తున్నారు. మద్యం, మనీ పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.




Next Story