బండి సంజయ్ ను బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
Mynampally Hanumantha Rao Warns Bandi Sanjay. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
By Medi Samrat Published on 15 Aug 2021 5:52 PM ISTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశాడు.. నా గురించి ఏం తెలుసని నన్ను యూజ్‌లెస్ ఫెలో అన్నాడు. ఇంకోసారి మల్కాజ్‌గిరిలో అడుగుపెడితే బండి గుండు పగులుద్ది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు హనుమంతరావు. నేటి నుంచి సంజయ్ భరతం పడతా.. తొందర్లోనే బండి సంజయ్ రాసలీలలు మీడియా ముందు పెడతానని చెప్పుకొచ్చారు. మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ ఆరోపణలు చేశాడు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ... ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. ఇంకా రాయడానికి వీలు లేని విధంగా బండి సంజయ్ పై బూతులు మాట్లాడారు మైనంపల్లి.
ఎమ్మెల్యే మైనంపల్లి, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్ళతో దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని, రేపటి నుంచి ఎమ్మెల్యే కబ్జాలన్నీ బయటకు తిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి అని తెలిసే బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదన్నారు.
బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై బీర్ బాటిళ్లతో దాడి చేసి గాయపరచిన ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు స్పందించి ఐపీసీ సెక్షన్స్ 307, 323,324,143,147,149 కింద కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తోపాటు మరో 15 మంది కార్యకర్తల పై కేసులు నమోదు చేశారు.