మటన్ కొంటే.. సోనుసూద్‌కు పైసలు

Mutton Shop On Sonu Sood Name. కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి సోనూసూద్‌ తన సేవలు కొనసాగిస్తున్నాడు. తొలి విడత కరోనా నుండి

By Medi Samrat  Published on  30 May 2021 6:08 PM IST
మటన్ కొంటే.. సోనుసూద్‌కు పైసలు

కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి సోనూసూద్‌ తన సేవలు కొనసాగిస్తున్నాడు. తొలి విడత కరోనా నుండి ప్ర‌స్తుత‌ రెండవ సీజన్ వ‌ర‌కూ ఏదో విధంగా త‌న ఉదార‌త‌ను చాటుకుంటూనే ఉన్నాడు. తాజాగా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తూ, అవసరమైన వారికి కాన్సన్ ట్రేటర్లను పంపిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు. అయితే సోనూసూద్ సేవ‌ల‌ను మెచ్చిన అభిమానులు ఆయ‌న పేరును త‌మకు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా వాడుతున్నారు. కొంత‌మంది గుడిక‌ట్టి పూజ‌లు చేస్తుంటే.. మ‌రికొంద‌రు ఆయ‌న పేరును షాపుల‌కు పెట్టుకుంటున్నారు.

తాజాగా సోనూ అభిమాని తాను ప్రారంభించిన మటన్ షాపు ఎదుట‌ సోనూ సూద్ పేరిట ఓ బ్యాన‌ర్‌ పెట్టుకున్నాడు. అంతేకాదు అక్క‌డ ఓ ఆప‌ర్ కూడా పెట్టాడు. కిలో 650 రూపాయ‌ల‌కే ధ‌ర ఫిక్స్ చేసి.. 600 రూపాయ‌లు తాను తీసుకుని.. 50 రూపాయ‌లు సోనూసూద్ ఛారిట‌బుల్ అంద‌జేస్తాన‌ని అంటున్నాడు షాపు య‌జ‌మాని. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇది జ‌రిగింది. ఈ విషయం సోనూసూద్ వ‌ర‌కూ వెళ్లింది. దీంతో స్పందించిన‌ సోనూ.. నేను శాఖాహారిని అయితే నాపేరున మాంసాహార దుకాణమా అంటూ చమత్కరించారు. మీ దుకాణానికి నేనేమైనా సహాయం చేయగలనా అని ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది.


Next Story