గుజరాత్ సబర్మతి నదిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులతో కలిసి సబర్మతి నదిని పరిశీలించారు. సబర్మతి మాదిరి మూసీ అభివృద్ధికి చేసే అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా తెలిపారు.
త్వరలోనే పార్టీలకు అతీతంగా జీహెచ్‌ఎంసీ మేయర్, హైదరాబాద్‌లో ఉన్న 150 మంది కార్పొరేటర్లు సబర్మతి నది స్టడీ టూర్ చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సబర్మతి నది మాదిరి మూసీ పునరాభివృద్ధికి ఫేజ్-1 కింద బాపు ఘాట్ వరకు చేసే అభివృద్ధిపై స్టడీ టూర్ ద్వారా జీహెచ్‌ఎంసీ బృందం పరిశీలించనుంది.