మునుగోడులో టీఆర్ఎస్ ఘ‌న‌విజయం

Munugodu Bypoll Result. మునుగోడు ఉప ఎన్నిక లో టీఆర్ఎస్‌ విజయం సాధించింది. సమీప అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్

By Medi Samrat  Published on  6 Nov 2022 12:35 PM GMT
మునుగోడులో టీఆర్ఎస్ ఘ‌న‌విజయం

మునుగోడు ఉప ఎన్నిక లో టీఆర్ఎస్‌ విజయం సాధించింది. సమీప అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(బిజెపి)పై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేల‌కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజ‌యంపై ఈసీ అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సివుంది. ఇక‌ ఈ ఎన్నిక‌లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవ‌డ‌మే కాక.. డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ అభ్య‌ర్ధిని పాల్వాయి స్ర‌వంతి మూడోస్థానంలో నిలిచారు. మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ న‌మోదు చేసుకుంది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజ‌యాలు సాధించింది. టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసింది. తాజా గెలుపు తో 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావ‌డం విశేషం.


Next Story
Share it