ముగిసిన మునుగోడు నామినేషన్ల ఉపసంహరణ.. ఎంతమంది మిగిలారంటే..

Munugode Nominations withdrawal Deadline Ends. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది.

By Medi Samrat  Published on  17 Oct 2022 11:20 AM GMT
ముగిసిన మునుగోడు నామినేషన్ల ఉపసంహరణ.. ఎంతమంది మిగిలారంటే..

మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇండిపెండెంట్ గా కెఎ పాల్ కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది.


Next Story
Share it